దేశ పరిపాలనకు పీఠికలో సూచించిన మౌలిక పునాది అంశాల ప్రకారం అన్ని రకాల హక్కులు అవసరాలు ప్రజలకు అందించడానికి 51 ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.
ఎన్నికల ద్వారా గెలుపొందిన రాజకీయ పార్టీ రాజ్యాంగంలో పొందుపరిచిన 51 ఆర్టికల్స్ ప్రణాళికా బద్దంగా అన్ని ఆర్టికల్స్ ఏకకాలంలో అమలుపరుస్తూ పరిపాలించాలి ఒక్క ఆర్టికల్ అమలు కాకున్నా ప్రజల అవసరాలు తీర్చడంలో తేడాలు వస్తాయి సమాజం అనేక రకాల గందరగోళానికి దారితీస్తుంది.
ఇక్కడ ఒక ఉదాహరణ పరిశీలించాలి. ఒక ఆట ఆడడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఒక్క రూల్ కూడా తప్పిన ఆట ఆడించే ఎంపైర్ ఆట నిలిపివేసి తప్పిన రూల్ సవరించి మళ్ళీ ఆట ఆగిస్తాడు.
రూల్ ఒక్కటి కూడా తప్పకుండా ఆడినప్పుడు మాత్రమే? ఆట సక్రమంగా సాగి, విజేత ఎవరో పరాచిత ఎవరో తెలుస్తుంది. కాబట్టి ఒక ఆటని అంత క్రమ పద్ధతితో ఆడాల్సి ఉంటుంది. లేకుంటే? ఆట అంత గందరగోళం అవుతుంది.
కాబట్టి ప్రజలారా దేశాన్ని పరిపాలించడానికి చట్టాల రూపంలో రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం లోని రూల్స్ అన్ని ప్రజలందరూ తెలుసుకొని ఒక్క ఆర్టికల్ కూడా తప్పిన అమలు కాకున్నా ప్రజలందరూ ఎంపైర్స్ గా ముందుకొచ్చి అన్ని ఆర్టికల్స్ అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత ఒక ఆట ఆడడానికి ఆటకు సంబంధించిన రూల్స్ ప్రతి ఆటగాడు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి. ఆటరూల్ ప్రకారం ఆడతాడు. ప్రేక్షకులు కూడా ఆట యొక్క రూల్స్ తెలుసుకొని ఆట చూసి ఆనందిస్తారు. ఆటకు సంబంధించిన రూల్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోండి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల జీవితాలసరాలు తీర్చే ఆర్టికల్స్ కు ప్రజలు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ప్రజలారా!? ఒక్కసారి ఆలోచించండి. భారత రాజ్యాంగం ప్రజల అవసరాలు తీర్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రధానంగా 51 ఆర్టికల్స్ రాయడం జరిగింది. రాజ్యాంగాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో ప్రజల అవసరాలు ఎలా తీర్చాలి వివరించడం జరిగింది.
1.)మొదటి భాగం. ఆర్టికల్ 1 నుండి 4వ ఆర్టికల్ వరకు దేశ భూభాగము, సరిహద్దులు, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలను విభజించే విధానం, పొందుపరచడం జరిగింది.
2.) రెండో భాగం:- ఆర్టికల్స్ 5 నుండి 11 ఆర్టికల్స్ వరకు దేశంలో ప్రజలకు పౌరసత్వం అందించే విధానం, పౌరసత్వం యొక్క ప్రయోజనాలు, ప్రాముఖ్యత, వివరించడం జరిగింది.
3.) మూడవ భాగం:-ఆర్టికల్ 12 నుండి 35 ఆర్టికల్స్ వరకు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఏమిటి? మనిషికి మనిషికి మధ్య సంబంధాలు ఎలా? ఉండాలి. వివరించడం జరిగింది.
4.) నాలుగవ భాగము:-ఆర్టికల్ 36 నుండి 51 ఆర్టికల్స్ వరకు ఆదేశిక సూత్రాలు ఉత్పత్తి పంపిణీ విధానం ఏ పద్ధతి ప్రకారం జరిపించాలి ప్రజలకు ఏ పద్ధతితో అందించాలి సమాజం అరాచకానికి గురి కాకుండా పరిపాలించే కీలక అంశాలు వివరించడం జరిగింది