రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగిన నరమేధమే గుజరాత్ దాడులు

0
1

— ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం

గుజరాత్ లో 2002 లో జరిగిన దారుణ మరణ కాండ యాదృచ్ఛికంగా జరిగినది కాదని, ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ అధికార ఆధిపత్యాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించడం కోసం చేసిన ప్రణాళిక బద్ద కుట్ర అని శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎల్బీజీ భవన్ లో జరిగిన మానవతపై దాడి పుస్తక పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జస్టిస్ కృష్ణ అయ్యర్, మరియు ఇతర మేధావులు చేసిన పరిశోధనలో గుజరాత్ లో జరిగిన అనేక ఘోరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆనాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి , హోం మంత్రిగా ఉన్న మోడీ , అమిత్ షాలు తమ అధికారాన్ని ఎక్కువ కాలం కొనసాగించడానికి మెజారిటీ మతస్తుల ఓటింగ్ ని శాశ్వతం చేసుకోవడానికి మైనార్టీ వర్గాలను పథకం ప్రకారం ఊచ కోత కోశారని అన్నారు. ఈ నరమేధం లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యక్షంగా ఉపయోగించుకొని ఈ దాడులకు పాల్పడిందన్నారు. దీనిని ఆసరా చేసుకొనే కేంద్రంలో బిజెపి అధికారాన్ని చేపట్టిందన్నారు. అధికారం చేపట్టిన దగ్గర నుండి రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకున్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను లౌకిక ప్రజాస్వామ్య వాదులకు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

 సిఐటియు రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య మాట్లాడుతూ గుజరాత్ నమూనా మతోన్మాద దాడులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు దీనిని ఎదుర్కోవడంలో మధ్యతరగతి,  ఉద్యోగ , ఉపాధ్యాయులు, ప్రజల యొక్క పాత్ర చాలా కీలకమైంది అన్నారు ఆ పాత్రను పోషించే దానిలో భాగంగా రాజ్యాంగాన్ని,  లౌకిక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు .

   లౌకిక పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఏవి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సభలో లౌకిక వేదిక కన్వీనర్ సయ్యద్ సర్దార్, ఓ పి ఆర్ డి జిల్లా నాయకులు చావలి సుధాకర్, యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు డి వీరాంజనేయులు , ఎస్ రవి, జెవివి జిల్లా కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్ , డివైఎఫ్ఐ అధ్యక్షులు కే ఎఫ్  బాబు , ఐలు  నాయకులు  ఏఐటీయూసీ కార్యదర్శి పివిఆర్ చౌదరి ,పి కరిముల్లా ఖాన్ , సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు దామా శ్రీనివాసులు , టీ మహేష్ మరియు వివిధ సంఘాలు , అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here