రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ ల ఓటమి అనివార్యం…

0
6

ఎంపీ విజయసాయిరెడ్డి:

  • ఏపీలో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడు ఓడిపోవడం ఎంత అనివార్యమో,మంగళగిరిలో లోకేశ్ ఓడిపోవాడం అంతే అనివార్యమని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
  • కుప్పంలో నాన్నాగారు చంద్రబాబు పోటి చేయటం ఎంత అని వార్యమో,మంగళగిరిలో నేను పోటి చేయటం కూడా అంతే అనివార్యం అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యాలకు ఆయన ఈ విధంగా స్పందించారు.టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని కలసిన సందర్భంగా టిడిపి అనుకూల మీడియా,ఆ పార్టీ నాయకులు స్పందించిన తీరపై గురువారం ఆయన ప్రతిస్పందించారు.
  • గుజరాత్ సీఎంగా పుష్కరకాలం చేసి, మూడోసారి కూడా నేనే దేశ ప్రధానిగా ఎన్నికవుతానన్న భరోసాకు కారణం దేశంలోనే స్వయంప్రకటిత సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు అని ప్రధాని అన్నట్లు. ఎన్డీఏ ప్రభుత్వంలో బాబు లేకపోవడం తీరని లోటని ఢిల్లీలో బాబుతో మోదీ అన్నారని పచ్చకుల మీడియా ఉవాచ.
    మీరే ప్రభుత్వంలో ఉండుంటే చైనాతో గొడవ, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థికస్థితి, శ్రీలంకలో సంక్షోభం రాకపోను. గేట్స్‌కు కంప్యూటర్ కోర్సు, అమరావతి నిర్మాణం అన్నీ మీకే సాధ్యం చంద్రబాబుజీ అని మోదీ చెప్ఫినట్లు టీడీపీ ప్రచారంపై వ్యాంగ్యంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here