రాష్ట్రంలో నూతనంగా దళిత గిరిజన జేఏసీ ఏర్పాటు

0
4
 • అన్నీ కుల సంఘాలుదళిత గిరిజన జేఏసీ తో ఐక్యం కావాలి
 • దళిత, గిరిజనుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు..
 • దళిత,గిరిజనులకు చట్టబద్ధమైన సంక్షేమ అభివృద్దే లక్ష్యం
 • అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరచబడిన పథకాలు అందాలి
 • గతంలో అమల్లో ఉన్న 27 పథకాలను తొలగించడం దారుణం
 • పునరుద్ధరణకు రాష్ట్రస్థాయిలో దళిత గిరిజన ఐక్య ఉద్యమం
 • మాజీ ఐఏఎస్ అధికారి టి. గోపాల్ రావు ఆధ్వర్యంలో దళిత గిరిజన జేఏసీ
 • ఆగస్టు నెలలో అన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి సదస్సులు
 • సెప్టెంబర్ లో విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు ద్వారా కార్యాచరణ ప్రకటిస్తాం
 • దళిత గిరిజన జేఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పనబాక కృష్ణయ్య వెల్లడి
 • దళిత గిరిజన ప్రజలకు అండగా ఉంటాం..
 • త్వరలోనే ఎస్సి,ఎస్టీ, బీసీ,మైనార్టీ ఐక్యవేదిక
 • దళిత గిరిజనలు ఐక్యమత్యంగా ఉండాలి
 • గ్రామ స్థాయి నుండి దళిత గిరిజన జేఏసీ పునాది
 • దళిత గిరిజన ప్రజలకు అన్యాయం జరిగితే సహించం:పనబాక

రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం,ఆయన అడుగుజాడల్లో నడుస్తూ
దళిత,గిరిజనుల హక్కులు కాపాడటానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అనీ దళిత గిరిజన జేఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పనబాక కృష్ణయ్య వెల్లడించారు.

దళిత గిరిజనుల హక్కుల రక్షణకు రిటైర్ సీనియర్ ఐఏఎస్ అధికారి టి .గోపాల్ రావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన దళిత గిరిజన జేఏసీ అన్ని జిల్లాలలో సదస్సులు ఏర్పాటులలో భాగంగా మంగళవారం నెల్లూరులోని హోటల్ శివం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా దళిత గిరిజన జేఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టబద్ధమైన సంక్షేమ అభివృద్ధి రక్షణలతో ప్రత్యేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోపొందుపరచబడిన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత మూడు సంవత్సరములుగా అమలు చేయకుండా దళిత, గిరిజనులకు ద్రోహం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గిరిజనుల హక్కుల రక్షణకు రిటైర్ సీనియర్ ఐఏఎస్ అధికారి టి గోపాల్ రావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన దళిత గిరిజన జేఏసీ అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మాజీ ఐఏఎస్ అధికారి టి గోపాల్ రావు ఆయన సందేశం లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు చేయకుండా గతంలో అమల్లో ఉన్న 27 పథకాలను తొలగించడం దారుణమని ఈ పథకాలు పునరుద్ధరణకు రాష్ట్రస్థాయిలో దళిత గిరిజన ఐక్య ఉద్యమం రూపొందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నెలలో అన్ని జిల్లాలు స్థాయిలో సదస్సులు నిర్వహించి సెప్టెంబర్ లో విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు ద్వారా కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

గ్రామీణ స్థాయి నుండి దళిత,గిరిజన జె ఏ సి కి పునాదులు వేసి గ్రామ స్థాయి కమిటీ,మండల, నియోజకవర్గ, జిల్లా,రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి దళిత,గిరిజనల కొరకు పోరాటం చేస్తామని చెప్పారు. దళిత,గిరిజనలకు అన్యాయం జరిగే ఎంతటి ఉద్యమానికి అయినా వెనుకడబోము అనీ హెచ్చరించారు. త్వరలోనే అన్నీ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు, కుల సంఘాలు అన్నీ దళిత ,గిరిజన జె ఏ సి కలిసి ఐక్యమత్యంగా పనిచేయాలి అనీ పిలుపునిచ్చారు.

రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కొరవి వినయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దళిత గిరిజనులకు ఏ విధంగా ఉపయోగపడటం లేదని దాని ద్వారా వారు ఇంకనూ పేదరికంలోకినెట్టివేయబడుతున్నారని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాధించిన హక్కుల రక్షణకు దళిత గిరిజన సంఘాలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జేఏసీలగా ఏర్పడి ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. అనంతరం సమావేశంలో పాల్గున్న వారు వారి వారి అమూల్యమైన సలహాలు,సూచనలు అందజేశారు.

ఈ సదస్సులో నెల్లూరు జిల్లా జేఏసీ కన్వీనర్ శీలం తిరుపయ్య, రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఎం రాణా ప్రతాప్,జిల్లా కో కన్వీనర్ దార్ల సునీల్ రాజు, కూరపాటి విజయ రాజు, వాదనాల వెంకటరమణ, కలివెల ఎలీషా, బొమ్మిల్ల బాల చెన్నయ్య,బి టి ఏనాయకులువేణు ,రమణయ్య, కలిమేలి పవన్ కుమార్, గోను శివాజీ, మన్నేపల్లి దాసు, పల్లం వెంకయ్య, మీజూరు మల్లికార్జునరావు, కల్లూరు రవి, గిరిజన నాయకుడు ప్రొఫెసర్ ప్ర శ్రీనివాసులు, లాయర్ దేవదానం, లాయర్ సెద్విన్, కనపర్తి గంగాధర్ తదితర దళిత గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here