రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్…

0
2

తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బోలోపేతం చేయ‌డంతో.. రోగుల తాకిడి ఎక్కువైంది. ప్ర‌తి ఒక్క‌రికి స‌కాలంలో వైద్యం అందుతోంది. ఇక మెడిసిన్స్‌ను కూడా పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రాష్ట్రంలో 12 చోట్ల సెంట్ర‌ల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. ఒక్కో స్టోర్‌కు రూ. 3.60 కోట్ల చొప్పున మొత్తం రూ. 43.20 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ స్టోర్స్‌లో ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ 12 సెంట్ర‌ల్ మెడిసిన్ స్టోర్స్ అందుబాటులోకి వ‌స్తే రోగుల‌కు వెంట‌నే మందులు అంద‌నున్నాయి. ఇక ఈ స్టోర్స్ ప‌రిధిలోని అన్ని ఆస్ప‌త్రుల‌కు కూడా స‌కాలంలో మెడిసిన్స్‌ను చేర‌వేసే అవ‌కాశం ఉంటుంది.

సెంట్ర‌ల్ మెడిసిన్ స్టోర్స్ ఇవే..

 1. సిద్దిపేట‌(టీచింగ్ హాస్పిట‌ల్)
 2. వ‌న‌ప‌ర్తి (జిల్లా ఆస్ప‌త్రి)
 3. మ‌హ‌బూబాబాద్ (జిల్లా ఆస్ప‌త్రి)
 4. జ‌గిత్యాల (జిల్లా ఆస్ప‌త్రి)
 5. మంచిర్యాల (జిల్లా ఆస్ప‌త్రి)
 6. భూపాల‌ప‌ల్లి (జిల్లా ఆస్ప‌త్రి)
 7. కొత్త‌గూడెం (జిల్లా ఆస్ప‌త్రి)
 8. నాగ‌ర్‌క‌ర్నూల్ (జిల్లా ఆస్ప‌త్రి)
 9. సూర్యాపేట (టీచింగ్ హాస్పిట‌ల్)
 10. భువ‌న‌గిరి (జిల్లా ఆస్ప‌త్రి)
 11. వికారాబాద్ (ఏరియా హాస్పిట‌ల్)
 12. గద్వాల (జిల్లా ఆస్ప‌త్రి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here