కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ ద్రౌపది ముర్మును ఉద్దేశించి మాట్లాడిన మాటలు పార్లమెంట్లో పెద్ద దుమారాన్ని సృష్టించాయి. ఆయన ద్రౌపది ముర్మను రాష్ట్రపత్ని అంటూ కామెంట్ చేశారు. దాంతో బీజేపీ మండిపడింది. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ముర్మను తీవ్రంగా అవమానించారని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అన్నారు. దీనిని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆమోదించారన్నారు. కాగా దీనిపై అధీర్ రంజన్ స్పందిస్తూమ నోరుజారానని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఆయన రాష్ట్రపత్ని అంటూ కామెంట్ చేశారు. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే రాష్ట్రపతి ముర్మును అవమానించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణలు చేశారు. సోనియాగాంధీ.. ద్రౌపది ముర్ముని అవమానించడాన్ని ఆమోదించారని, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఒప్పుకున్నారని ఆమె విమర్శించారు.