సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ.. రాష్ట్రానికి ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ అధికారుల మంత్రాంగం ఫలించడంతో తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ.10,200 కోట్ల బకాయిలు ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. అలాగే రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు సైతం అంగీకరించింది. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయాలని గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న వేళ.. రాష్ట్రానికి ఊరటనిచ్చేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన కింద రాష్ట్రంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ.10,200 కోట్ల మేర బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఢిల్లీలోని కేంద్ర విద్యుత్ శాఖ అధికారులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ కలిసిన వెంటనే నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకునే విషయంలో తెలంగాణ సర్కారు కేంద్రంతో పోరాటం సాగిస్తున్న వేళ.. ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణ నుంచి బియ్యం సేకరణకు సైతం కేంద్రం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలోని మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం నుంచి ఢిల్లీ పర్యటనలోనే ఉన్న సీఎం కేసీఆర్.. సీనియర్ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం అయ్యారు. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ , పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెండింగ్ నిధులను ఎలా రాబట్టాలనే విషయమై వీరు చర్చించారు