రాహుల్‌ గాంధీ ఎ భారత ప్రధాని అవుతారని .. లింగాయత్ మఠ మహంత్ 

0
12

Rahul Gandhi: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత ప్రధాని అవుతారని కర్ణాటకలోని ఓ లింగాయత్ మఠ మహంత్ అన్నారు. ఆ రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఉన్న మురుఘా మఠాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.

  • అలాగే లింగాయత్‌ల ఇష్టలింగ దీక్షను ఆయన చేపట్టారు. ఆ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘా శరణరు నుంచి ఈ దీక్షను స్వీకరించారు. రాహుల్ గాంధీ నుదుట విభూది రాశారు. అలాగే, శివలింగం పొదిగిన హారాన్ని రాహుల్ మెడలో వేశారు.
  • ఈ సందర్భంగా హవేరీ హోసముట్‌ స్వామీజీ మాట్లాడుతూ… ”ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారు” అని వ్యాఖ్యానించారు.
  • అయితే ఇధి ఇలా ఉండగ:

“హవేరీ హోసముట్‌” స్వామీజీ చేసిన వ్యాఖ్యలపై శ్రీ శివమూర్తి మురుఘా శరణరు అభ్యంతరం తెలిపారు. మఠంలో అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. మఠం రాజకీయ వేదిక కాదని అన్నారు. “ప్రధానిగా ఎవరు ఉంటారు? అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు”. అనంతరం మళ్ళీ ఆయన మాట్లాడుతూ.. తమ మఠం అన్ని వర్గాల వారినీ, రాజకీయ పార్టీల వారినీ స్వాగతిస్తుందని తెలిపారు. ఇక్కడ తాము ఎవరి పట్లా ఎటువంటి వివక్షా చూపబోమని అన్నారు. తాము మానవాళి మొత్తాన్ని ప్రేమిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here