రూ.1400 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

0
4
mumbai drugs

ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా 700 కిలోల నిషేధిత మెఫెడ్రోన్ ను యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు గురువారం సీజ్ చేశారు.

మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 1400 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఒక ఔషధ తయారీ కంపెనీ యూనిట్‌లో సోదాలు చేస్తుండగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయని వివరించారు. ఆ కంపెనీ యూనిట్‌లో దీనిని తయారు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి ముంబైలో నలుగురు, సలసొపారాలో ఒకరిని అదుపు లోకి తీసుకున్నామని చెప్పారు. ఈ మెఫెడ్రొన్‌ను మియోవ్ మియోవ్ లేదా ఎండీ అని కూడా వ్యవహరిస్తారు. వ్యక్తుల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపే దీన్ని ఎన్‌డీపీఎస్ యాక్టు కింద నిషేధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here