పల్నాడు జిల్లా…నరసరావుపేట టౌన్ ఊళ్లో ఎనిమిదేళ్లగా నమ్మకంగా ఎరువులు, పురుగు మందుల దుకాణం నిర్వహించినషేక్ మస్తాన్వలికి సుమారు రూ.3 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశాడని కారంపూడి మండలం చింతపల్లివాసులు ఎస్పీ రవిశంకర్రెడ్డికి సోమవారం నిర్వహించినస్పందనలో ఫిర్యాదు చేశారు. సగం సొమ్ముగా ధాన్యం,పత్తి, మిరప పంటనిఅరువుగావిక్రయించాం. వృద్ధులు,మహిళలు కష్టార్జితాన్ని వడ్డీకిచ్చారు. అప్పులుచెల్లించమని అడిగితే ఇదిగో.. అదిగో అంటూ రోజులు గడిపాడు. ముందస్తు ప్రణాళిక మేరకు ముగ్గురుపిల్లలను వసతి గృహాల్లో చేర్చాడు. ద్విచక్ర వాహనంపైభార్యతో కలిసి పరారయ్యాడు. నెల రోజులు కారంపూడి పోలీసు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. మాకు న్యాయం చేయమనివారు విన్నవించారు.