రూ.50 కోట్ల మార్క్ చేరుకున్న “సర్దార్”

0
5

హీరో కార్తి హీరోగా సర్దార్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందింది. సర్దార్ సినిమా అక్టోబర్ 21వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలై 5 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను చేరుకుంది. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భవిష్యత్ తరాలకు మంచి మెస్సేజ్ ను ఇచ్చింది. రాబోవు తరాల వారు మంచి నీళ్ల కోసం ఎంతగా ఇబ్బంది పడతారనే విషయాన్ని సినిమాలో బాగా చూపించారు. సర్దార్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కార్తి ప్రకటించారు. త్వరలోనే ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పుడు కార్తి చేతిలో ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్ 2′, ఖైదీ 2’, ‘సర్దార్ 2’ సినిమాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here