రెండో టీ20లో ఓడిపోయిన టీమిండియా

0
3
indi vs wi

వెస్టిండీస్‌తో సోమవారం రాత్రి రెండో టీ20లో గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుందా? లాస్ట్ ఓవర్‌‌లో భువనేశ్వర్ కుమార్ రూపంలో ఆప్షన్ అందుబాటులో ఉన్నా అవేష్ ఖాన్‌ తో రోహిత్ శర్మ  ఎందుకు సాహసం చేశాడు? ఈ ప్రశ్నలకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం చెప్పాడు. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన ఈ రెండో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 138 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ 141/5తో ఛేదించేసింది.విండీస్ గెలుపునకి చివరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు క్రీజులో దేవాన్ థామస్ (31 నాటౌట్: 19 బంతుల్లో 1×4, 2×6), ఓడెన్ స్మిత్ (4 నాటౌట్: 4 బంతుల్లో) ఉన్నారు. ఇద్దరూ టాప్ ఆర్డర్ బ్యాటర్లేమీ కాదు. కానీ.. బంతిని బలంగా హిట్ చేయగలరు. మరోవైపు చివరి ఓవర్ వేయడానికి భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్ రూపంలో ముగ్గురు బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అప్పటికే 2 ఓవర్లు వేసిన భువీ 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా 3 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చాడు. మరోవైపు అవేష్ ఖాన్.. రెండు ఓవర్లలో అప్పటికే 19 పరుగులిచ్చి ఒత్తిడిలో ఉన్నాడు. దాంతో.. అందరూ భువీతోనే లాస్ట్ ఓవర్‌ని రోహిత్ బౌలింగ్ చేయిస్తాడని ఊహించారు. కానీ.. అవేష్ ఖాన్ చేతికి రోహిత్ బంతినివ్వగా.. ఫస్ట్ బాల్‌నే నోబాల్‌గా విసిరిన అవేష్ ఖాన్.. ఆ తర్వాత ఫ్రీహిట్ బంతికి సిక్స్, నెక్ట్స్ బాల్‌కి ఫోర్ సమర్పించుకుని మ్యాచ్‌ని చేజార్చాడు.భువనేశ్వర్ కుమార్‌ని పక్కనపెట్టి అవేష్ ఖాన్‌తో లాస్ట్ ఓవర్‌ని బౌలింగ్ చేయించడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘‘మొదటగా చెప్పాలంటే బోర్డుపై తగినంత స్కోరు లేదు. దానికి కారణం మేము సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. నిజమే.. భువీ చివరి ఓవర్‌ని సమర్థంగా వేయగలడు. గత కొన్నేళ్లుగా అతను మ్యాచ్‌లను కాపాడుతున్నాడు. కానీ.. నేను యువ బౌలర్‌కి ఆ చివరి ఓవర్ వేసే అవకాశం ఇవ్వాలని అనుకున్నా. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే.. అవేష్ ఖాన్‌లో టాలెంట్ ఉంది. అతనికి మా మద్దతు కొనసాగుతుంది’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం రాత్రి 9:30 గంటలకి మూడో టీ20 జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here