రెచ్చిపోయిన అంబులెన్స్ డ్రైవర్

0
5
osmania ambulance driver

పాతబస్తీ తాడబన్ ఏరియాకు చెందిన ఓ మహిళ ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఆమె పూర్తిగా కోలుకోవడంతో గురువారం డాక్టర్లు ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు అంబులెన్స్‌ డ్రైవర్ల దగ్గరికి వెళ్లి మాట్లాడగా భారీ రేటు చెప్పారు. దీంతో మీ అక్కా చెల్లెలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా? అని అనడంతో అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి దుర్భాషలాడుతూ ఓ మహిళ పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.ఆరిఫ్ ఖాన్ అనే వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్ సిబ్బందితో కుమ్మక్కై రోగులను వేధిస్తున్నాడని, డిశ్చార్జి అయిన వారు తన అంబులెన్స్‌లో వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా బయటి నుంచి అంబులెన్స్ తెచ్చుకుంటే దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. అతడి ఆగడాలను ఆస్పత్రి అధికారులు, స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని పదేపదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ మాఫియా నుంచి తమను రక్షించి దోపిడీకి గురికాకుండా కాపాడాలని రోగులు, వారి బంధువులు వేడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here