రేపటి నుంచి షూటింగ్‌లు బంద్.. 

0
13

 స్తంభించనున్న టాలీవుడ్

దిల్ రాజు , నిర్మాతల గిల్డ్ ఫిల్మ్ ఛాంబర్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ చేయనున్నట్టు ఉమ్మడిగా ప్రకటించారు.

టాలీవుడ్‌లో ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్‌కానున్నాయి. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు జరగవని, అన్ని సమస్యల మీద చర్చలు జరిగిన తరువాత, వాటికి పరిష్కారం దొరికిన తరువాతే షూటింగ్‌లు ప్రారంభమవుతాయని ప్రకటించారు. షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

పరిశ్రమలోని సమస్యలన్నింటితో పాటుగా.. సినీ కార్మికుల వేతనాలు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వేతనాల పెంపుపైనా చర్చించబోతోన్నామని, అన్నింటికి ఒకే సారి పరిష్కారం చేయాలని అనుకుంటున్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు. ఇక వీరి నిర్ణయంతో రేపటి నుంచి షూటింగ్‌లు బంద్ కానున్నాయి.

ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. వీటిపై సీ కళ్యాణ్, దిల్ రాజు వంటి వారు సూచనలిస్తూ వచ్చారు. అయితే అప్పుడు జరిగిన సమావేశాల్లో షూటింగ్‌ల బంద్ అనే విషయాన్ని పరిగణించామని, కానీ తుది నిర్ణయం తీసుకోలేదని సీ కళ్యాణ్ పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు ఉండకపోవడంతో.. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, 24 క్రాఫ్ట్స్ యూనియన్స్, కార్మికులు అందరూ కలిసి చర్చలు జరుపుకుంటారని తెలుస్తోంది. టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు, నిర్మాణ వ్యయం, రెమ్యూనరేషన్‌ల విషయం మీద చర్చలు జరుగుతాయని సమాచారం.

ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు సిద్దంగా ఉన్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. రామ్ చరణ్ తమ పరిస్థితిని అర్థం చేసుకున్నాడంటూ దిల్ రాజు రెండ్రోజుల క్రితం మాట్లాడిన మాటలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here