నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది మండల పరిధిలోని నందిపల్లి గ్రామ సమీపంలో రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడు బండి ఆత్మకూరు మండలం కోడూరుకు చెందిన జమాల్ బాషా కుమారుడు యూసుబ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు మహానంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.