లంచాల కోసం పీడిస్తున్న వైద్య సిబ్బంది..

0
5

శవాల మీద పేలాలు.. పోస్టుమార్టం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే..

శవాల మీద పేలాలు ఏరుకునే వాడా అనే సామెత మీరు వినే ఉంటారు.ఈ సామెత ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కచ్చితంగా సరిపోతుంది.ఇక్కడ చేతులు తడపందే అసలు పనులు కావు అదేమిటి అని నిలదీస్తే ఇంకా అంతే సంగతులు గంటల తరబడి నిరీక్షించాల్సిందే.. మా బాధల్లో మేమున్నామని బాధితులు లబోదిబోమన్న వారికి పట్టదు.ఇంతకు ఆ ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారం ఏంటో..అసలు ఆ ఆసుపత్రి ఎక్కడుందో. ఒక్కసారి మీరే ఓ లుక్ వేయండి..

ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి నుంచి వివాదాలకు కొదవలేదని చెప్పాలి.ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రవర్తన విమర్శలకు దారితీస్తుంది.ఇక్కడ చేతులు తడపందే పని కాదని ఆసుపత్రికి వస్తున్న ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈనెల 8వ తేదీ సోమవారం అమరావతి,అనంతపురం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల బంధువులు వారి బాధల్లో వారు ఉంటే పోస్టుమార్టం చేయాలంటే ఒక్కొక్క మృతదేహానికి 5,000 ఇవ్వాల్సిందే అని అక్కడ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారని మృతదేహాల బంధువులు ఆరోపిస్తున్నారు.డబ్బు ఇచ్చేవరకు పోస్టుమార్టం చేయడం కుదరదని మీరు ఇచ్చే డబ్బు డాక్టర్ కు ఇవ్వాలని కాంపౌండర్ చెప్పినట్లు బాధితులు వెల్లడించారు.ఐదు మృతదేహాలకు 25 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పారు.

మృతదేహాల బంధువులు మా వద్ద డబ్బు లేదని ఎంత మొరపెట్టుకున్నా కనీసం కనికరం లేకుండా డబ్బు ఇవ్వనిదే పని జరగదని కాంపౌండర్ ఖరాఖండిగా చెప్పేశాడు.ఇక చేసేది ఏమీ లేక ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు పదివేల రూపాయలకు మృతుల బంధువులు కాంపౌండర్ తో ఒప్పందం చేసుకున్నారు. డబ్బు చేతిలో పడిన తర్వాతనే పోస్టుమార్టం కోసం మృతదేహాలను తరలించారు.దీనిపై స్థానిక ప్రజలలో భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆప్తులు చనిపోయి బాధల్లో ఉన్న వారిని ఇలా పీక్కు తినడం ఎంతవరకు కరెక్ట్ అని దీనిపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి లంచాల కోసం పీడిస్తున్న వైద్య సిబ్బందిపై తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here