శ్రావణ తొలి శుక్రవారం.
పితృతిధి – శుద్ధ పాడ్యమి. ధార్మిక సాధనలు
లక్ష్మీప్రదమైన శ్రావణమాసం శుక్రవారంతో ప్రారంభం కావడం విశేషం. శ్రావణమాస వ్రతం ఆచరించేవారు ఈరోజున సంకల్పం చెప్పుకుని ప్రారంభించాలి.
1] ఇంటి ముందు గోమయముతో అలికి, రంగవల్లులు తీర్చిదిద్దాలి.
2] ఇల్లంతా గోపంచకముతో శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించాలి.
3] గడపను దేశవాళీ ఆవుపాలతో, తదుపరి శుద్ధ జలంతో అభిషేకించి శుభ్రపరచాలి / పసుపు పూసి కుంకుమ బొట్లు తీర్చిదిద్దాలి / అక్షతలు పూలతో అలంకరించాలి.
4] గృహానికి మామిడి తోరణాలతో అలంకరించాలి.
5] గృహమంతా రెండు పూటలా సాంబ్రాణి ధూపం వెయ్యాలి.
6] అన్ని వర్గాల స్త్రీలు గౌరీదేవిలా సంప్రదాయ వస్త్రాలు అలంకరణ వైభవాలతో వెలిగిపోతూ శ్రావణలక్ష్మిని ఆహ్వానించాలి.
శక్తి మేరకు జగన్మాత శ్రీలక్ష్మీదేవి పూజ / వివిధ స్తోత్ర పారాయణములతో అర్చించి, మధుర పదార్ధములు మరియు మహా నివేదన సమర్పించాలి.
కనీసం ముగ్గురు ముత్తైదువులకైనా సదక్షిణయుత తాంబూలం సమర్పించాలి.