లక్ష రూపాయల ఫ్యాన్సీ రాఖీ చోరీ..

0
3

 బోరుమంటున్న చిరు వ్యాపారి

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రాఖీల షాప్‌లో చోరీ జరిగింది. లక్ష రూపాయల విలువైన ఫ్యాన్సీ రాఖీలను ఎత్తుకెళ్లారు. షాపు యజమాని విజయ్.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో చిరు వ్యాపారి కాచిగూడలో తాత్కాలిక షాపు పెట్టుకున్నాడు.

రక్షా బంధన్ పండుగకు సరిగ్గా రెండు రోజుల ముందు కాచిగూడలోని ఓ రాఖీల దుకాణంలో చోరీ జరిగింది. రాఖీలను ఎత్తుకెళ్లారు. ఆ..! పెద్దగా నష్టం జరిగి ఉండదులే అనుకోవద్దు. ఆ దొంగలు ఎత్తుకెళ్లింది ఫ్యాన్సీ రాఖీలు. ఒక్కో రాఖీ విలువ లక్ష రూపాయలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. ఈసారి కరోనా భయం కాస్త తగ్గడంతో గిరాకీ ఉంటుందని ధైర్యం చేస్తే.. దొంగలు ఇలా కొంప కొల్లేరు చేశారని ఆ చిరు వ్యాపారి లబోదిబోమంటున్నాడు. సోమవారం (ఆగస్టు 8) రాత్రి ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో విజయ్ అనే వ్యక్తి రెండు రోజుల కిందట కాచిగూడలోని బిగ్ బజార్ సమీపంలో తాత్కాలికంగా రాఖీల షాపును ఏర్పాటు చేశాడు. సోమవారం రాత్రి దుకాణాన్ని మూసేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం తిరిగొచ్చి చూసే సరికి షాపులో కొన్ని బండిళ్ల రాఖీలు మాయమయ్యాయి. వాటిలో లక్ష రూపాయల విలువ చేసే ఫ్యాన్సీ రాఖీలు కూడా ఉన్నాయి.


దొంగతనం జరిగినట్లు గుర్తించిన విజయ్.. వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here