లెక్కలు చెప్పండి ప్లీజ్ – ఏపీ సర్కార్‌కు కాగ్ వరుస లేఖలు….

0
5

నెలవారీ జమా ఖర్చుల వివరాలను కాగ్‌కు ఏపీ ప్రభుత్వం పంపడం లేదు ఆ వివరాల కోసం కాగ్ నుంచి ఏపీ ప్రభుత్వానికి పదే పదే లేఖలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.AP : ఆంధ్రప్రదేశ్ జమా ఖర్చులు తేల్చడానికి కాగ్‌కు అవసరమైన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క నెల జమా ఖర్చులు మాత్రమే కాగ్ వెల్లడించింది. ఏప్రిల్ నెల ఏపీ ప్రభుత్వ జమా ఖర్చుల వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

రాష్ట్ర ఖజానాకు సంబంధించిన నెలవారీ లెక్కలపై కాగ్‌ మళ్లీ వివరాలు పంపాలని కాగ్ మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలు్సతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదో నెల గడుస్తున్నా, ఇంకా తొలి నెల లెక్కలు మాత్రమే ఖరారయ్యాయి. ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది లెక్కలు కూడా పెండింగ్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి ప్రతీ నెలా ఆదాయ ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు కాగ్ మదింపు చేసి వెబ్‌సైట్‌లో పెడుతూ ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాలూ లెక్కలను ఆర్బీఐకి పంపుతూనే ఉంటాయి. ఆర్బీఐ లెక్కలేసి చెబుతూ ఉంటుంది. కాగ్ కూడా ఆడిట్ చేస్తుంది. ఆడిట్ చేసిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. . ఏయే కేటగిరీల్లో వచ్చింది.. ఖర్చు ఎంత..దేనికి ఎంత ఖర్చు పెట్టారు వంటి వివరాలు అందులో ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు పంపుతూనే ఉంది.

తెలంగాణలో జూన్‌ వరకు మూడు నెలల గణాంకాలు కూడా సిద్ధం చేసింది. వాటిని కాగ్ మదింపు చేసి వెబ్‌సైట్‌లో కూడా పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే ఏపీ నుంచి లెక్కలు !అయితే ఆంధ్రా నుంచి ఒక్క నెలది మాత్రమే కాగ్ అందుబాటులో ఉంచుంది. లెక్కలకు సంబంధించిన వివరాల పెండింగ్‌పై పదేపదే కాగ్‌, ఎజి కార్యాలయాల నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు ఆర్థికశాఖ అధికారులు మాత్రం వివరాలు సిద్ధం చేయలేదని చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఎజి కార్యాలయం అధికారులు ఆర్థికశాఖతో లెక్కలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా రుణాలు, గ్యారెంటీల వివరాలు సిద్ధం చేయడంలో నెలకొంటున్న సందిగ్ధమే ఈ జాప్యానికి కారణంగా ఆర్థికశాఖ కాగ్‌కు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇస్తే తీసుకోవడం కాగ్‌ చేయాల్సింది.. ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం చేయాలన్నది కాగ్‌కూ అర్థం కావడం లేదు. కాగ్ నుంచి పదే పదే లెక్కలుకాగ్ అనేది రాజ్యంగబద్దమైన సంస్థ. ఏ ప్రభుత్వమైనా ఆదాయాన్ని.. అప్పులను ఇష్టారీతిన ఖర్చు పెట్టకూడదు. ఎలాఖర్చు పెట్టారో ఎప్పటికప్పుడు కాగ్ ద్వారా ఆడిటింగ్ చేయించాలి. అసెంబ్లీలో అనుమతి తీసుకున్న విధంగానే ఖర్చు పెట్టాలి. ఏమైనా తేడా ఉంటే కాగ్ వెల్లడిస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలను వివాదాస్పదమవుతున్నాయి.

ఈ కారణంగా ప్రభుత్వం సమాచారాన్ని కాగ్‌ కు కూడా ఆలస్యంగా పంపుతోంది. గత ఆర్థిక సంవత్సర లెక్కలను కూడా కాగ్ ఇంకా సర్టిఫై చేయలేదని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఆర్థిక సంవత్సవరానికి సంబంధించి ఒక్క నెల మాత్రమే కాగ్ ఆడిటింగ్ చేయించడం వివాదాస్పదమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here