వరసగా చనిపోతున్న ఆవులు..

0
4

ఇప్పటికీ 999 మృతి.. చర్మవ్యాధే కారణం..! గుజరాత్‌లో లంపీ చర్మవ్యాధితో 999 మంది ఆవులు, గేదెలు చనిపోయాయి. ఈ వ్యాధికి గురైన పశువులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. చర్మంపై పొక్కులు, నోట్లో బొబ్బలతో ఏమి తినలేక, జ్వరంతో బాధపడుతూ చనిపోతున్నాయి. అయితే సకాలంలో గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే బతుకుతాయని పశు వైద్యులు అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దోమలు, ఈగలు, కలుషితమైన నీరు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తింది. ఇప్పటికే 14 జిల్లాలో వ్యాధి వ్యాప్తి చెందింది.

అయితే ఈ వ్యాధి కట్టడి కోసం ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి 2.68 లక్షల మందికి టీకాలు వేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు వ్యాధి నియంత్రణకు ఉన్నతస్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. లంపీ చర్మ వ్యాధి దోమలు, ఈగలు, పేలు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కూడా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి.

లక్షణాలు…
ఈ వ్యాధి సోకిన జంతువుల్లో జ్వరం, కళ్లు, ముక్కు నుంచి స్రావాలు కారుతుంటాయి. శరీరమంతా పొక్కులు, మచ్చలు ఏర్పడతాయి. నోటిలో బొబ్బలు వస్తాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. తినడానికి ఇబ్బంది పడుతుంటాయి. దీంతో పశువులు మృతి చెందుతుంటాయి. అయితే సకాలంలో చికిత్స అందిస్తే ఆవులకు ప్రాణాపాయం ఉండదని వైద్యులు అంటున్నారు.

14 జిల్లాలో వ్యాప్తి…
ఈ వ్యాధి ఇప్పటి వరకు గుజరాత్‌లోని కచ్, జామ్‌నగర్, దేవభూమి ద్వారక, రాజ్‌కోట్, పోర్ బందర్,మోర్బి సురేంద్ర నగర్, అమ్రేలి, భావ్‌నగర్, బొటాడ్, జునాగఢ్, గిర్ సోమనాథ్, బనస్కాంత, సూరత్‌ జిల్లాలో ఎక్కువగా ఉంది. మొత్తం 880 గ్రామాల్లోని పశువులు ఈ వ్యాధి బారిన పడగా.. 37,121 జంతువులకు వైద్యం చేశారు.

ఈ వ్యాధి నియంత్రణ కోసం అహ్మాదాబాద్‌లోని జీవీకే-ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో పశు సంవర్థక శాఖ అధికారుల 24 గంటల పర్యవేక్షణతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. వెంటనే చికిత్స, ఇతర సమాచారాలను అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1962 సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇదే సమయంలో అధికారులు ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ వర్షాకాలంలో దోమలు, ఈగలు, కందిరీగాలను కంట్రోల్ చేసేందుకు వివిధ రకాలైన మందులను చల్లుతున్నారు. పశువుల సంరక్షణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here