వికలాంగులకు, వితంతువులకు కొత్త పెన్షన్ లు ఇవ్వాలి

0
4

సిపిఎం ఒంగోలు నగర కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో నగర కార్యదర్శి వర్గ సభ్యులు దామా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ నగరంలో అర్హులైన వృద్దులకు ‘ వికలాంగులకు, వితంతువులకు కొత్త పెన్షన్ లు ఇవ్వాలని, అప్లికేషన్ పెట్టుకున్న అర్హులైనవారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమంలో అభివృద్ధి బాగా జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు తప్ప శివారు కాలనీలో రోడ్డు కాలువలు నిర్మాణం చేయడం లేదు. వర్షాలు పడటం వలన గుంటల్లోనీరు నిల్వ ఉంటున్నాయి వెంటనే రోడ్లు కాలువలు నిర్మాణం చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ అధికారులు గంటలు పూడ్చ తామని చెపుతున్నారు కానీ గుంటల్లో పూడ్చడంలో నాణ్యత పాటించడం లేదు .దీనివలన వెంటనే మరల గుంటలు ఏర్పడుతున్న వి.నాణ్యత పాటించాలన్నారు. చెత్త సేకరణ పన్ను ప్రతికుటుంబం నుండి వసూలు చేయడానికి డ్వాక్రా గ్రూపులను ఉపయోగించడానికి ఖండించారు. ప్రజల నుండి ముందస్తుగా అనగా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు చెత్త సేకరణ పన్ను వసూలు చేయడానికి ఖండించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరపాలక సంస్థ లో అభివృద్ధి కుంటుపడింది అన్నారు .ఒంగోలు ఆఫీసులో ప్రతి పనికి ఒక రేటు పెట్టి మామూలు వసూలు చేయడానిఖండించారు. మామూలు ఇవ్వక పోతే పనులు చేయకుండా ప్రజలను తిప్పుకుంటున్నారు.సచివాలయాల్లో డె తేసర్టిఫికెట్ కు మామూలు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నగరపాలక సంస్థ లోఅవినీతిని అరికట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. స్థానిక సంస్థల పరిష్కరించే వరకు ప్రజలను కూడ గట్టిపోరాటం చేస్తామన్నారు ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు తర బి శ్రీనివాసులు, కం కణాలరమాదేవి నగర కమిటీ సభ్యులు ఎస్ . డి హుస్సేన్ ,ఎస్కే హరికృష్ణ శ్రీరాం శ్రీనివాసులు, A శ్రీనివాసులు, కొర్నెపాటి శ్రీనివాసులు, ఎండి యాసిన్‌ / దారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here