-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ
రాజధానుల ఏర్పాటులో రాష్ట్రానికి అధికారం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా? లేక ఆయన 3 ఏళ్లు నిద్రపోయారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత ఏపీలో 3 రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ దాఖలు చేయటమేంటి? అని ప్రశ్నించారు. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు.