విజయ్ ఆంటోనీ కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో 1975 జూలై 24న జన్మించాడు
విజయ్ ఆంటోనీ భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఉత్తమ సంగీత విభాగంలో “నాక ముక్క” అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఈ పాట ద్వారా అతను గుర్తింపు పొందాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇది పాడబడింది. తన తొలి చిత్రం 2012 లో “నాన్” అయినప్పటికీ అతను సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్నాడు.