విజిల్స్ వేస్తూ ‘జై బాలయ్య’ అంటూ  ఓ బామ్మ సందడి..

0
8

బాలయ్య సినిమా షూటింగ్‌లో ఓ బామ్మ సందడి చేసింది. విజిల్స్ వేస్తూ.. ‘జై బాలయ్య’ అంటూ తన అభిమానాన్ని చాటింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ కర్నూలులో సందడి చేస్తున్నారు. NBK 107 షూటింగ్‌లో భాగంగా కర్నూలు నగరంలో కొన్ని సీన్లు తెరకెక్కి్స్తున్నారు. అంత్యక్రియల సీన్‌ను కర్నూలు నగర వీధుల్లో చిత్రీకరిస్తున్నారు. పూలతో అలంకరించిన వ్యాన్‌లో బాలకృష్ణ, శృతిహాసన్ తదితర నటీనటులు ప్రయాణించారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. జైబాలయ్య అంటూ నినాదిస్తూ.. సందడి చేశారు. 

బాలయ్యను చూసేందుకు వచ్చిన జనాల్లో ఓ పెద్దావిడ అందరి దృష్టి ఆకట్టుకుంది. డ్యాన్స్ చేస్తూ.. విజిల్స్ వేస్తూ ‘జై బాలయ్య’ అంటూ అక్కడ ఉన్న అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, బాలయ్యను చూసేందుకు తరలివచ్చిన జనాలతో కిక్కిరిసిన రోడ్ల వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయ సభను తలపించేంత మంది జనాన్ని చూస్తే.. బాలయ్యకు ఇంత క్రేజ్ అందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వీడియోలను ఇక్కడ చూడండి

నందమూరి బాలకృష్ణ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు. వారిపై కోపం చూపించడమే కాదు.. ప్రేమగా కూడా ఉంటారు. తాజాగా బాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా బాలయ్య తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదివరకు బాలయ్య ఓ అభిమానిని కలుస్తానని మాటిచ్చారు

అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు బాలయ్య. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here