విడిపోయిన స్నేహాలు కలవాలంటే ఇలా చెయ్యండి

0
3

మహమ్మారి తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది. పర్సనల్‌గా వెళ్ళి కలవడం కంటే, వీడియో కాల్స్, టెక్ట్స్ మెసేజెస్‌తో ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. కాస్తా ఫ్రెండ్‌షిప్ దూరమయ్యాయి. కొన్ని కొత్త స్నేహాలు వచ్చాయి. జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్‌తో ఫ్రెండ్షిప్‌ని కొనసాగించడం కాస్తా కష్టం. రోజువారీ పనులు, కుటుంబ సభ్యులకి కేర్ తీసుకోవడం, పని మొదలైన విషయాలతో స్నేహాలు ప్రభావితమవుతాయి. బంబుల్ రిలేషన్‌షిప్ నిపుణుడు, షాజీన్ శివదాసాని కోల్పోయిన ఫ్రెండ్షిష్‌ని ఎలా కలపాలో టిప్స్‌ని అందించారు.

మీరు ఎవరినైనా కలవాలనుకుంటే ప్రయత్నం చేయడం అతి ముఖ్యమైనది. మీరు వారి గురించి అడగడం, సమస్యలను తెలుసుకోవడం, బాధ్యతగా ఉండడం, ప్రాముఖ్యతని ఇవ్వడం చాలా ముఖ్యం. అదే విధంగా ఏదైనా సందర్బంలో వారికి అందుబాటులో లేకపోతే ఆ విషయాన్ని వారికి తెలియజేయండి.

వారితో మాట్లాడేందుకు, వారికి సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ విషయంలో ఆలోచించేందుకు కాస్తా టైమ్ ఇవ్వండి. కచ్చితంగా మీతో ఉండాలని ఆశించవద్దు. వారికి ఇష్టమైతే మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు. అప్పటివరకూ వెయిట్ చేయండి.

మీరు, మీ ఫ్రెండ్ వర్చువల్‌గా కలిసి టచ్‌లో ఉండేందుకు ప్లాన్ చేయండి. ఇందుకోసం మీ గ్యాంగ్స్‌ అందరినీ కూడా పిలుచుకోవచ్చు. అదే విధంగా మీ క్లోజ్ ఫ్రెండ్‌తో పర్సనల్‌గా మాట్లాడితే మీ ఇద్దరి బంధం మరింత పెరుగుతుంది. ఈ విధంగానే మంచి స్నేహాలు పెరుగుతాయి.

అన్ని సంబంధాలకు కృషి అవసరం. అందులో స్నేహాలు కూడా ఉన్నాయి. మీరు మీ విడిపోయిన స్నేహాన్ని కలుపుకోవాలనుకున్నప్పుడు మొదట విడిపోవడానికి గల కారనాలను గుర్తుంచుకోండి. మీ స్నేహితులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు నిజాయితీగా ఉండాలి.

స్నేహాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయితే బాధపడొద్దు.మీరు విడిపోయిన ఫ్రెండ్‌పై ఒత్తిడి తీసుకురావొద్దు. మీరు చేయాల్సిందల్లా మళ్ళీ కనెక్ట్ కావాలనే కోరికను వారికి తెలియజేయండి చాలు.. తిరిగి మీ ఫ్రెండ్షిప్ ప్రారంభమయ్యేందుకు సమయం పడుతుంది.

మీరు కొత్తగా గ్రూప్ ఫ్రెండ్స్‌ని ఏర్పరుచుకోవాలంటే కొత్త స్నేహితులు కావాలనుకుంటే మీరే కలిసిపోవాలి. వివిధ వ్యక్తులను కలవాలి. బంబుల్స్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ చెప్పిన దాని ప్రకారం.. మానవ అనుభవంలో సామాజిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయి. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన సంబంధాలు కీలకం. భారతీయ పెద్దలలో 34 శాతం మంది తమ ఫ్రెండ్షిప్ సర్కిల్‌ని విస్తరించుకోవాలని కోరుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. బారతదేశంలోని చాలా మంది వ్యక్తులు ఇప్పుడు వర్చువల్‌గా స్నేహితులని వెతకడానికి ముందుకొస్తున్నారు. చివరిగా బంధాలు చాలా ముఖ్యమైనవి, విలువైనవి వీటిని కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే స్నేహాలు జీవితంలో గొప్ప వరం. వీటిని ఆస్వాదించాలి.

మనకి ఏ కష్టమొచ్చినా, ఎంత బాధలో ఉన్నా మంచి ఫ్రెండ్ ఉంటే చాలు వాటన్నింటికి ఎదురీగొచ్చు. అందుకే చిరకాల మిత్రులు ఉండాల్సిందే. మీకు ఉండి ఉంటారు కదా.. వాటిని ఇంకా అందంగా మలుచుకోండి. స్నేహపు మాధూర్యాన్ని పొందండి. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here