విద్యార్థులు చిన్నతనం నుండే విద్యతోపాటు చట్టాల పట్ల ప్రాథమికంగా అవగాహన కలిగి ఉండాలని తద్వారా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కే. శ్యాంబాబు అన్నారు. ఈరోజు గురువారం కొత్తపట్నం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగిస్తూ ఈ పాఠశాలలో కొంతమంది విద్యార్థులు సమూహంతో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లబ్ ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల మరియు చట్టాల పట్ల అవగాహన కలుగజేయడం జరుగుతుందని అన్నారు లైసెన్సు లేకుండా వాహనం నడపటం వంటివి చేయకూడదని అన్నారు. అలాగే ఎవరైనా విద్యార్థులు బడి మధ్యలో మానేస్తే ఆ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని అన్నారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని, విద్యాహక్కు చట్టం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలేటి సుబ్బారావు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
