విద్యార్థితో క్లాస్‌రూమ్‌లో ..?

0
10

 విద్యార్థితో క్లాస్‌రూమ్‌లో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్..!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో అందరూ సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చాకిరీ చేయించుకుంది. క్లాస్‌రూమ్‌లోనే దర్జాగా కుర్చీలో కూర్చుని విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. గతంలో బీహార్‌లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఇలా మసాజ్ పట్టించుకున్నాడు.

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచరే దారి తప్పింది. పిల్లలకు పాఠాలు బోధించి.. తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలు వారితో పనులు చేయించుకుంది. క్లాస్‌రూమ్‌లో దర్జాగా కూర్చొని ఓ విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గురువు స్థానంలో ఉండి ఆమె ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

యూపీలోని హ‌ర్దోయ్‌లోని పోఖ‌రి ప్రైమ‌రీ స్కూల్లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉర్మిళా సింగ్‌ అనే ఉపాధ్యాయురాలు దర్జాగా కూర్చొని విద్యార్థితో మ‌సాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న టీచ‌ర్ ఎడ‌మ చేతికి ఓ విద్యార్థి మ‌సాజ్ చేస్తున్నాడు. పిల్ల‌వాడు చేతికి మ‌సాజ్ చేస్తుండ‌గా ఆ టీచ‌ర్ బాటిల్‌తో నీళ్లు తాగుతోంది. క్లాస్‌రూమ్‌లోని మిగతా పిల్ల‌లు ఎవ‌రి ప‌నిలో వాళ్లున్నారు. ఆ స్కూల్లో ఆమె అసిస్టెంట్ టీచ‌ర్‌గా పనిచేస్తోంది. ఈ వీడియో బయటకురావడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఆ మహిళా టీచర్‌‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here