గౌరవనీయులైన హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రయ గారు ఈరోజు 31 జులై, 2022న చండీగఢ్ లో హరియాణా రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లోని నాట్య విభాగం అధిపతిగా పనిచేస్తున్న శ్రీమతి డా. వనజ ఉదయ్ ప్రఖ్యాత కూచిపూడి నాట్య విద్వాంసురాలి నేతృత్వంలో బృందంలోని విద్యార్థులు ప్రదర్శించిన కూచిపుడి, ఆంధ్రనాట్యం మరియు శ్రీ కళా కృష్ణ నృత్య దర్శకత్వం వహించిన పేరిణి శివతాండవం యొక్క శాస్త్రీయ నృత్యాన్ని గౌరవనీయ గవర్నర్ గారు వీక్షించి, వారి నాట్య ప్రావీణ్యాన్ని ప్రశంసించారు. అనంతరం గవర్నర్ గారు విద్యార్థులను తొమ్మిది మందిని సత్కరించి వారిని అభినందించడం జరిగింది.
అనంతరం విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించినందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంగడ కిషన్ రావు గారిని టెలిఫోన్లో అభినందించడం జరిగింది.

