విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా SP

0
2

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపియస్ గారువిద్యార్థులలో పోటీతత్వాన్ని, దేశభక్తిని పెంపొందించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం: జిల్లా ఎస్పీ

భారతదేశ స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ రోజు పోలీసు కల్యాణ మండపంలో వివిధ స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు జిల్లా ఎస్పీ గారు నిర్వహించారు.

ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులతో ఎస్పీ గారు ముచ్చటించి, వారు గీసిన స్వాతంత్ర సమరయోధులు చిత్రాలు, జాతీయ పతాకం మరియు దేశభక్తిని చాటే వివిధ రకాల చిత్రాలను ఎంతో ఆసక్తి గా తిలకించారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్ని అద్భుతమైన చిత్రాలు వేశారని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో పోటీతత్వాన్ని, దేశభక్తిని పెంపొందిస్తాయని అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషనన్ల పరిధిలో ఉన్న పలు పాఠశాలు మరియు కాలేజీ విద్యార్థులకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది డ్రాయింగ్, పెయింటింగ్ మరియు ఇతర పోటీలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో AR ASP అశోక్ బాబు , DSB DSP బి.మరియాదాసు , ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాస రెడ్డి, ఆర్ఐలు శ్రీహరి బాబు, శ్రీ హరి రెడ్డి, SK.మౌలిధిన్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here