వినూత్నంగా తల్లిపై ప్రేమను వ్యక్తపరిచిన కొడుకు..

0
9

పదవీ విరమణ రోజున అమ్మకు అదిరిపోయే గిఫ్ట్

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కొడుకు తన తల్లికి మరిచిపోలేని బహుమతిని అందించాలనుకున్నాడు. ఆమె టీచర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సందర్భంగా ఆమెను స్కూల్ నుంచి తన గ్రామానికి హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. అమెరికాలో పనిచేస్తున్న యోగేష్ చౌహాన్ దాని కోసం ముందుగానే ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. అనుకున్న విధంగా తల్లిని హెలికాప్టర్‌లో తీసుకొచ్చి.. తన ప్రేమను చాటుకున్నాడు. దాంతో తల్లి సుశీల చౌహాన్‌ ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి

తల్లీబిడ్డల మధ్య ఉండే ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ వాటిని ఒకరిపై మరొకరు వ్యక్తీకరించుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. పుట్టిన రోజో.. ప్రత్యేకమైన రోజుల్లోనో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఓ కొడుకు తన తల్లిపై ఉన్న ప్రేమను అద్భుతంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఎప్పటికీ మరిచిపోని విధంగా తన అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. ఇక్కడ ఓ వ్యక్తి తన తల్లి టీచర్‌గా పదవీ విరమణ పొందిన సందర్భంగా ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు

రాజస్థాన్‌లో అజ్మీర్‌లో టీచర్‌గా పనిచేసే సుశీల చౌహాన్ శనివారం రిటైర్డ్ అయ్యారు. పిసంగన్‌లోని కేసర్‌పురా ఉన్నత పాఠశాలలో ఆమె 33 ఏళ్లపాటు పనిచేశారు. అయితే ఆమె పదవీ విరమణ సందర్భాన్ని ఓ మంచి మెమెరీగా ఉంచాలని కొడుకు యోగేష్ చౌహాన్ భావించాడు. దాని కోసం యోగేష్ ఓ హెలికాప్టర్‌ను బుక్ చేసి.. ప్రత్యేక అనుమతితో స్కూల్ నుంచి ఇంటికి హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. స్కూల్లో పదవీ విరమణ కార్యక్రమం పూర్తైన తర్వాత తోప్బ్రా గ్రామంలో వారి ఇంటికి సుశీలను హెలికాప్టర్‌లో దించాడు. గ్రామస్థులందరూ హెలికాప్టర్ దగ్గరకు చేరుకున్నారు. యోగేష్‌ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు.

కొడుకు చేసిన పనికి సుశీల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు సుశీల చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టమని అన్నారు. యోగేష్ చౌహాన్ వృత్తిరీత్యా ఇంజనీర్. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నారు. తన తల్లి పదవీ విరమణను చిరస్మరణీయం చేయాలనే ఉద్దేశంతో హెలికాప్టర్ రైడ్‌ ప్లాన్‌ చేశారు. తాను అమెరికాలో ఉంటున్నానని, అమ్మ పదవీ విరమణ కార్యక్రమం ఉందని తెలిసి.. నాలుగు రోజుల క్రితమే ఊరికి వచ్చానని యోగేష్ చెప్పారు. అమ్మకు సర్ఫ్రైజ్ ఇవ్వడానికి, తనకు ఎప్పటికి గుర్తుండిపోవాలని ఇలా చేశానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here