అసోంలోని జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్తున్న 6E-757 విమానం గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. రన్‌వేపై విమానం టైర్లు జారాయి. అలా జారిన టైర్లు రన్‌వేకి పక్కనే ఉన్న బురదలో చిక్కుకున్నాయి. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 98 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్లు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు ఇండిగో అధికారులు పేర్కొన్నారు.
ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. టేకాఫ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం జారడంతో టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. అసోంలో జరిగిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్లు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు ఇండిగో అధికారులు పేర్కొన్నారు
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్తున్న 6E-757 విమానం గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. రన్‌వేపై విమానం టైర్లు జారాయి. అలా జారిన టైర్లు రన్‌వేకి పక్కనే ఉన్న బురదలో చిక్కుకున్నాయి. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 98 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి ఎయిర్‌పోర్టులోని వెయిటింగ్ రూమ్‌కి తరలించారు. అనంతరం మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చారు.