వివాహిత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. 

0
13

విశాఖ (Vizag) ఆర్కే బీచ్‌ లో వివాహిత మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులకు సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆమె నెల్లూరుకు చెందిన రవితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని.. పెళ్లిరోజున భర్తతో కలిసి బీచ్ కు వచ్చిన సాయిప్రియ.. శ్రీనివాస్ మొబైల్ చూస్తున్న సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం. సముద్రంలో గల్లంతైనట్టు భర్త శ్రీనివాస్ భావించారు. సాయిప్రియ కోసం నేవీ హెలికాప్టర్‌తో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.. ఇంతలోనే నెల్లూరులో ప్రియుడితో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం..శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో ఉంటోంది. పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. పెళ్లి రోజు కావడంతో ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు బీచ్‌కి వెళ్లి కనిపించకుండా వెళ్లిపోయింది.

సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు భారీగా ఖర్చు చేశారు. హెలికాప్టర్లు, బోట్లలో గాలించారు. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ అన్నారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు తెలిసిందని.. ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సోమవారం రాత్రి సాయిప్రియ గల్లంతైనట్లు ప్రచారం జరిగింది. విశాఖ ఎన్.ఎ.డి. సమీపంలోని సంజీవయ్య నగర్‌‌కు చెందిన 22 ఏళ్ల సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. సాయిప్రియ సంజీవయ్యనగర్‌లోనే ఉంటుండగా.. శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం పెళ్లిరోజు కావడంతో భార్యాభర్తలు సాయంత్రం ఆర్కేబీచ్‌కు వచ్చారు. ఈ క్రమలో రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్‌ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు.

వెంటనే భర్త సాయిప్రియ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె సముద్రంలో గల్లంతై ఉండొచ్చని అనుమానించారు. మంగళవారం ఉదయం నుంచి స్పీడ్‌బోట్లు, నేవీ హెలిక్టాప్టర్‌ ద్వారా గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం నుంచి మళ్లీ నేవీ హెలికాప్టర్ ద్వారా గాలిస్తున్నారు. సముద్రంలో ఇంతగా గాలించినా సాయిప్రియ జాడ దొరకకపోవడంతో అసలు సముద్రంలోనే గల్లంతైందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఆమె నెల్లూరు ఉందని తేలడంతో అందరూ అవాక్కయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here