వివేకా హత్యకు సీ ఎం నైతిక బాధ్యత వహించాలి : బొండా

0
7

వివేకా హత్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. హత్యతో తనకు సంబంధం లేదని భావిస్తే, జగన్ రెడ్డి ఇప్పటికైనా వివేకా హంతకులను అరెస్టు చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప ఎంపీ టికెట్ వైఎస్ కుటుంబంలోనే ఉండాలని వివేకా పట్టుబట్టినందుకు భారతీరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తదితరులు పక్కా ప్రణాళికతో గొడ్డలితో దారుణంగా నరికి చంపారని సీబీఐ అఫిడవిట్ తో స్పష్టంగా తెలుస్తోందన్నారు. 

వివేకా హత్య కేసును సీబీఐ విచారించాలని  ప్రతిపక్షంలో ఉండగా హైకోర్టును కోరిన జగన్… అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, కొంత మంది అదృశ్య శక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొందని తెలిపారు. ఇదే అవినాష్ రెడ్డిని జగన్ అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకురావడం దేనికి నిదర్శనమో జగన్ సమాధానం చెప్పాలని కోరారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here