వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా చెబుతారు…అంటూ లోకేష్ ఫైర్

0
6

Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించారు. అనంతపురం ఎస్పీ ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించారు. దీనికి ఒక పద్దతి ఉంటుందని.. ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చెప్పాలన్నారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించిన వివరాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎస్పీ ఫేక్ అని ఎలా తేల్చారని.. ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అని చెప్పిందో బయటపెట్టాలన్నారు. సజ్జల నాలుగు గోడల మధ్య జరిగింది తప్పేంటి అన్నారని.. మరి ఎస్పీ ఫేక్ అని ఎలా చెబుతారన్నారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు మహిళల్ని కించపరుస్తున్నారని.. తన తల్లిని కించపరిచారన్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు.

మరోవైపు ఈ ఎపిసోడ్‌పై మాధవ్ మరోసారి స్పందించారు. తాను మొదటి నుంచి తనపై కుట్ర జరిగిందని చెబుతూనే ఉన్నానని.. ఇది కొంత మంది దుర్మార్గులు చేసి పనిగా చెప్పుకొచ్చారు. ఇది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ఆరోజే చెప్పానని.. ఇది టీడీపీ నేతలు చేసిన పనిగా ఆరోపించారు. ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని.. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదన్నారు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోందన్నారు.

తాను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసన్నారు ఎంపీ. ఫేక్‌ వీడియో సృష్టించి తనను అవమానించాలని చూశారని.. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఇక ఈ రాద్దాంతానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని.. తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here