వృద్ధుడిని తన్ని..వేలాడదీసిన కానిస్టేబుల్

0
5

మధ్యప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ వృద్ధుడిపై విరుచుకుపడ్డాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కాళ్లతో తన్నాడు. అక్కడితో ఆగకుండా అతని కాళ్లతో లాగి.. తలకిందులుగా వేలాడదీశాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. పోలీసు చర్యపై విమర్శలువ వెల్లువెత్తాయి. దాంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసి, కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ చాలా కర్కశంగా ప్రవర్తించాడు. ఓ వృద్ధుడిని దారుణంగా కొట్టడమే కాకుండా తలకిందులుగా వేలాడదీశాడు. ఈ అమానుషమైన చర్య జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో కానిస్టేబుల్ వృద్ధుడిని అతని ముఖంపై తన్నడం, కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ కానిస్టేబుల్ కొట్టి, తనడంతో ఆగకుండా పోలీస్ 61 ఏళ్ల వృద్ధుడిని.. కాళ్లతో పట్టుకుని ప్లాట్‌ఫారమ్ అంచున వేలాడదీశాడు.

ఇంత క్రూరంగా ప్రవర్తించేందుకు బాధిత వ్యక్తి హంతకుడో, దొంగలో అనుకుంటే ముమ్మాటికి పొరపాటు పడినట్టే. మద్యం మత్తులో ఉండి ఆ వృద్ధుడు అసభ్య పదజాలంతో పోలీసులను తిట్టాడు. ఈ కారణంతో ఆ కానిస్టేబుల్ వృద్ధుడిపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ అనాగరిక చర్యను ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే పోలీసులు నిజనిజాలు తెలుసుకుని.. సదరు పోలీస్‌పై చర్యలు తీసుకున్నారు.

రేవా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ భాసిన్.. ఆ కానిస్టేబుల్‌ అనంత్ శర్మను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు గోపాల్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కానిస్టేబుల్‌పై IPC 323, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వారు తెలిపారు. అయితే తనకు ఆ పోలీసు ఎవరో తెలియదని, తనలాంటి వృద్ధుడిపై ఎందుకు దాడి చేశాడో కూడా అర్థం కావడం లేదని గోపాల్ ప్రసాద్ చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here