వెస్టిండీస్ టూర్‌కి దూరంగా విరాట్ కోహ్లీ..

0
3

 విరాట్ కోహ్లీ రీఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ జరగనుండగా.. ఆ టోర్నీకి తాను అందుబాటులో ఉంటానని భారత సెలెక్టర్లకి విరాట్ కోహ్లీ సమాచారం అందించాడు. అంతేకాకుండా..?

  • జింబాబ్వే పర్యటనకీ కోహ్లీని ఎంపిక చేయని సెలెక్టర్లు
  • సెలెక్టర్లకి తాజాగా ఫోన్ చేసి మాట్లాడిన కోహ్లీ
  • ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌కి రెడీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై జులైలో జరిగిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకి దూరంగా ఉండిపోయాడు. అతనిపై సెలెక్టర్లు వేటు వేశారని కొంత మంది మాజీలు అభిప్రాయపడుతుండగా.. వర్క్‌లోడ్ తగ్గించేందుకు రొటేషన్‌లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చామని సెలెక్టర్లు చెప్పుకొచ్చారు.

కానీ.. వరుసగా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు, జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కి కోహ్లీ దూరంగా ఉండటంపై కొత్త సందేహాలు తెరపైకి వచ్చాయి. ఆగస్టు- సెప్టెంబరులో ఆసియా కప్, అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనుండటంతో.. పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లీని ఈ మెగా టోర్నీలకి సెలెక్టర్లు ఎంపిక చేస్తారా? లేదా? అనే సందిగ్ధత కూడా నెలకొంది.

వెస్టిండీస్ టూర్‌కి దూరంగా ఉండిపోయిన విరాట్ కోహ్లీ.. పారిస్‌లో తన భార్య అనుష్క శర్మతో కలిసి ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవానికి కొంత మంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీకి సూచించింది కూడా ఇదే. ఫామ్ కోల్పోయిన కోహ్లీని.. కొన్ని రోజులు ఆటకి దూరంగా ఉండి.. మళ్లీ ప్రెష్‌ మైండ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని సూచించారు. దాంతో.. దాదాపు నెల రోజులు క్రికెట్‌కి దూరంగా విరాట్ కోహ్లీ ఉండబోతున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకూ ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ ఆస్ట్రేలియా గడ్డపై ప్రారంభంకానుంది. ఈ రెండు మెగా టోర్నీల్లోనూ తాను ఆడతానని విరాట్ కోహ్లీ తాజాగా భారత సెలెక్టర్లకి స్పష్టం చేశాడు.

‘‘ఆసియా కప్ టీమ్ సెలెక్షన్‌కి తాను అందుబాటులో ఉంటానని భారత సెలెక్టర్లకి విరాట్ కోహ్లీ సమాచారం అందించాడు. ఆసియా కప్ తర్వాత జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2022లోనూ ఆడతానని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ రెండు టోర్నీల మధ్య ఆటగాళ్ల లయ దెబ్బతినకుండా ఉండేందుకు ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్లకి రెస్ట్ ఇవ్వబోం. కానీ.. ఆసియా కప్ ముంగిట మాత్రం ఓ రెండు వారాలు విశ్రాంతినిస్తాం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here