వైభవంగా శిద్దా వ్రిష్ పుట్టినరోజు వేడుకలు

0
10
A grand birthday celebration for Siddha Vrish

సేవా కార్యక్రమాలు నిర్వహించిన శిద్దా అభిమానులు.

మాజీమంత్రివర్యులు శిద్దా రాఘవరావు మనవడు,శిద్దా సుధీర్ కుమార్ దంపతుల కుమారుడు శిద్దా వ్రిష్ పుట్టినరోజు వేడుకలు చిమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా జరిగాయి.చిన్నారి వ్రిష్ పుట్టినరోజు సందర్భంగా పారిశ్రామికవేత్త,వైసీపీ యువ నాయకులు శిద్దా సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి శ్రీ హరిహర క్షేత్రంలో సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కేకు ను శిద్దా శిద్దా సుధీర్ కుమార్ దంపతులు శిద్దా వ్రిష్,శిద్దా అరాధ్య తో కలసి కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు,ఇన్ఛార్క్ వెంకటేశ్వర్లు శిద్దా సుధీర్ కుమార్ దంపతులకు వేద ఆశీర్వదాలు,స్వామి వస్త్రాలు,తీర్థప్రసాదాలు  అందచేసారు.ఈ కార్యక్రమంలో గ్రంధి శ్రీహరి,ఆంజనేయులు, మాజేటి ప్రదీప్,వెలుగువారిపాలెం సుబ్బారావు,మందాడి సుబ్బారావు,లక్ష్మణ్,పరశురామ్  తదితరులు శిద్దా వ్రిష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

శిద్దా వ్రిష్ పుట్టినరోజు పునస్కరించుకొని దర్శి పట్టణంలో శిద్దా అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా మండాది సుబ్బారావు ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపేట్టారు, అనంతరం వృద్ధులకు దుప్పట్లు అందచేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందాడి సుబ్బారావు సతీమణి జ్యోతి, నాగూర్ వలి, కంచర్ల శ్రీనివాస్, బాబు,కోటేశ్వరరావు, ఇరుగుల శ్రీనివాసరెడ్డి,లోకేష్,వాసు, కల్లూరి అనిల్,విష్ణు వర్ధన్,శివ,భాష, బారీష,మధు శిద్దా అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here