వైయస్సార్ సిపి ఎమ్మెల్యేల సమావేశం..

0
1

గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన 20 లక్షల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్*

మాకు ఇవ్వవలసిన 7660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్ళించి దొడ్డిదారిన గ్రామ సచివాలయాలు ద్వారా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలకు ఇచ్చి గ్రామాల్లో, పట్టణాల్లో వారితో పనులు చేయించి రాజకీయ అనుచిత లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం సిగ్గుచేటైన విషయం

సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు చేయవలసిన పనులను ఎమ్మెల్యేల చేత, వాలంటీర్ల చేత చేయించాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరు 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకం, అనైతికం రాజేంద్ర ప్రసాద్

సచివాలయాలకు చేయూత అని ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలను విడుదల చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లకు నిన్న ముఖ్యమంత్రి గారు వైయస్సార్ సిపి ఎమ్మెల్యేల సమావేశంలో ఆదేశాలు జారీ చేసి ఆ నిధులతో ఆ ప్రాంతంలో పనులు చేసుకోమని ఎమ్మెల్యేలకు చెప్పడం దారుణం. ఆ నిధులను సచివాలయాలకు, ఎమ్మెల్యేలకు, వాలంటీర్లకు కాకుండా గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చి సర్పంచుల, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ల చేతనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేయించవలసిన దిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పట్ల చిన్నచూపు చూస్తూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇది 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకం.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయం గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీ లను నిర్వీర్యం చేసి, సర్పంచులను, ఎంపీటీసీ లను, కౌన్సిలర్ల ను, కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలు లాగా మారుస్తుంది.

ప్రజలకు కావాల్సిన రోడ్లు,డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్ మొదలగునవి కల్పించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల దే తప్ప- చట్ట ప్రకారం గ్రామ సచివాలయ లకు, వాలంటీర్లకు, ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదు.

ముఖ్యమంత్రి గారి నిర్ణయం గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పోటీగా సమాంతర సచివాలయ వ్యవస్థ ను, వాలంటీర్లను ఏర్పాటుచేసి మా స్థానిక ప్రభుత్వాల నిధులు,విధులు, అధికారాలను హైజాక్ చేసి సచివాలయాలకు కట్టబెడుతున్నారు. ఇది చూస్తూ మేము సహించేది లేదు.

గ్రామ సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించిన 7660 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకున్నది. కనుక ఆ రూ,,7660 కోట్లను కూడా మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here