వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

0
7

ఆయన్ను మా పార్టీ నేతగా పరిగణించడంలేదు.ఆయన జనసైనికుడు

విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌‌బాబు పై సెటైర్లు పేల్చారు. అసలు పంచకర్ల రమేష్ అనే వ్యక్తి వైఎస్సార్‌సీపీ నాయకుడని తామైతే పరిగణించట్లేదు అన్నారు. ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పంచకర్ల నియోజవర్గ పర్యటనపై ఎమ్మెల్యే అదీప్ రాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొదట పీఆర్పీ తర్వాత కాంగ్రెస్, టీడీపీ.. ఇప్పుడు జనసేన అంటూ విమర్శించారు. పెందుర్తి నియోజకవర్గంలో పర్యటించే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలతో తిరగడం లేదని.. గతంలో పీఆర్పీ, టీడీపీ నేతలు ఆయన వెంట నడుస్తున్నారన్నారు. తాము జగన్ సైనికులమని.. ఆయన జనసైనికుడు అన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమంటున్నారని.. రేపు జనసేన పార్టీలోకి వెళతారన్నారు ఎమ్మెల్యే.

విశాఖకు చెందిన పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలినంకావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికలకు ముందు పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

పంచకర్ల మళ్లీ 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడిపోయారు. అనంతరం ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే సొంత పార్టీ నేతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here