వ్యూహాత్మకంగా నారా లోకేష్ అడుగులు.

0
6

పరిణితి చెందాడు …. పరుగులు పెట్టిస్తున్నాడు.

తండ్రి చాటు బిడ్డ అని, టిడిపి అధినేత చంద్రబాబు వారసునిగా అసమర్దుడిగా, రాజకీయ మనుగడ సాగిస్తున్నాడని, తెలుగు మాట్లాడటం రాదని పప్పు అని ప్రచారం చేశారు. మూడు శాఖల మంత్రిగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ ప్రత్యర్దులకు టార్గెట్ గా నారా లోకేష్ నిలిచాడు.

రాజకీయ ఆటలో ఓ భాగంగా లోకేష్ ను అసమర్దునిగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాజకీయ ప్రత్యర్దులు యత్నించారు. నారా లోకేష్ ను రాజకీయ ప్రత్యర్దులు, సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ కించపరచి అవమానించారు. 2019లో మంగళగిరిలో ఎమ్మెల్యేగా అభ్యర్దిగా ఓడిపోయాడు. కాని ఓడిన చోటే మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనస్సు గెలిచాడు. రాష్ట్ర రాజకీయాలలో వెలుగు చుక్కగా మారాడు. రాజకీయంగా పరిణితి చెందాడు.

కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు

టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయ వారసునిగా నారా లోకేష్ రాకతోనే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. 70 లక్షల మంది టిడిపి సభ్యులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్సూ కవర్ చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. పేద కార్యకర్తలకు సంక్షేమ నిధి ద్వార ఆర్దిక సాయం అందింపచేస్తున్నారు.

క్రింది స్దాయిలో వాస్తవాలు తెలుసుకుంటున్నాడు

కలకపటం ఎరుగనివాడు, రాజకీయ కుట్రలు తెలియని వాడు మంగళగిరి రాజకీయాలను ఒంటపట్టిచుకున్నాడు.. ఎప్పటికప్పుడు టిడిపి కార్యక్రమాలలో భాగంగా ఇంటింటికి తిరిగి క్రింద స్దాయిలో వాస్తవాలను ప్రజ సమస్యలను అడిగి మరి తెలుసుకుంటున్నాడు. ఇటీవల మంగళగిరి రత్నాల చెరువులో పర్యటించాడు. బురదలో నడిచాడు. గ్రావెల్ రోడ్డు వేయించాడు.

అందుబాటులో ఉండడు అనే ఆరోపణాలు పటాపంచాలు చేశాడు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష యువనేతగా క్రీయాశీలకం పాత్ర పోషిస్తుండటంతో మంగళగిరి చేనేత ముద్దు బిడ్డ సీనియర్ నాయకులు నందం అబద్దయ్యకు నియోజకవర్గ సమన్వయకర్తగా కీలక బాద్యతలు అప్పగించారు.

పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకుని దిశగా అడుగులు వేస్తూ సమర్దవంతమైన ద్వితీయ శ్రేణి క్యాడర్ ను తయారు చేసుకునే పనిలో నిమగ్నమైయ్యాడు. బలోపేత దిశగా క్యాడర్ ను క్రిందిస్దాయి నుండి పటిష్టపరిచుకుని దూకుడు పెంచాడు.

అధికారంలోకి వస్తే జె టాక్స్ ల తొలగింపు

రాజధాని అమరావతి అభివృద్ది చెందాలంటే టిడిపితోనే సాధ్యమని, టిడిపి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తాం, జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం, సామాన్యులకు పేదలకు భారంగా మారిన పన్నులు తగ్గింపు, జె టాక్స్ ల తొలగింపు, నిత్యావసర సరుకుల అధిక ధరల నియంత్రణ చేపడతామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

మోసపూరిత రాజకీయాలు చేయలేను

4 రూపాయలకు భోజనం, 10 రూపాయలకు 5 రకాల కూరగాయలు పధకాలు ప్రవేశ పెట్టి మంగళగిరి ప్రజలను మోసం చేయాలసిన అవసరం నాకు లేదు. ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత రాజకీయాలు చేయలేను అనేది నారా లోకేష్ నుండి వినిపించే మాట. మాట ఇస్తే మాట తప్పను..మభ్య పెట్టాను, చేయాలి అనుకుంటే చేస్తాను అనే సిద్దాంతంతో రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. టిడిపి పార్టీలో క్రియాశీలకంగా అనుభవపూర్వకంగా లోపాలను సరిచేసుకుంటూ అడుగులు వేస్తున్నాడు.

ప్రత్యర్దుల కుటీల రాజకీయ శక్తులకు అడ్డుగొడగా నిలిచి వెన్నుపోటు రాజకీయాలను చవిచూస్తూ నారా లోకేష్ తన దైన శైలీలో ముందడుగు వేస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేసే వారికి భవిష్యత్ కర్మసిద్దాంతం పనిచేస్తుందని పార్టీ వర్గాల నుండి బలంగా వినిపిస్తుంది.

తగ్గేదేలే

2019 ఎన్నికలకు రెండు నెలల ముందు బరిలో నిలిచి మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్దిగా ఓడిన, నియోజకవర్గంను విడువక ఓటమికి లోపాలను పరిశీలన చేసుకున్నారు.

కరోనా కాలంలో నియోజకవర్గ పాలకులు సాయం చేయకుండా కనుమరుగైతే సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. స్వచ్చంధ సేవా సంఘాలు, పార్టీ శ్రేణుల ద్వార భోజనం, బియ్యం, కూరగాయలు, మందు బిళ్లలు, అక్సిజన్ సిలెండర్లు కరోనా రోగులకు అందింపచేయటంతో పాటు పేదలకు ఆసుపత్రి బిల్లులు చెల్లించి దాన శీలతను చాటుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా పెళ్లి కానుకలు

2019 నుండి మంగళగిరి నియోజకవర్గంలో కుల, మత రాజకీయ పార్టీలకు అతీతంగా తనను పెళ్లికి ఆహ్వానించిన వారికి పెళ్లి కానుకలను అందింపచేస్తున్నారు.

మంగళగిరి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్, ఎంఎస్ఎస్ విగ్రహాం వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి రోజు సూమారు 280 మందికి భోజనం అందింపచేస్తున్నారు.

తాడేపల్లిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు కు సన్నాహాలు చేస్తున్నారు.
మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల లో మూడు వైద్య శాలలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందింపచేయటంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు సన్నాద్దమైయ్యారు. నియోజకవర్గ పర్యటనలో కంటి సమస్యలతో ఎదురైన వృద్దులకు కంటి అపరేషన్లు చేయిస్తున్నారు.

మంగళగిరి పట్టణంలో లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వార స్వర్ణకారులకు హెల్త్ క్యాంప్, ఇన్సూరెన్స్, రుణాలు ఇప్పించటం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో పలు చర్చిల అభివృద్దికి తన వంతుగా ఆర్దిక సాయం అందించారు.

పాస్టర్లు, మౌజన్లు, పూజారులకు పండుగలకు కానుకలు

మూడేళ్ల కాలంలో ప్రతి ఏడాది పండుగలకు నియోజకవర్గ పరిధిలోని 750 మంది పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు, 180 మంది ఇమామ్ మౌజన్లకు రంజాను కానుకలు, 650 మంది పూజర్లకు ఉగాది కానుకలను బట్టలు పెట్టి నారా లోకేష్ పంపిణీ చేయిస్తున్నారు. రంజాన్ పండుగకు 2 వేల మంది ముస్లిం సోదరులకు రంజాన్ తొఫా అందిస్తున్నారు.

పేదలకు చేయూతగా తొపుడు బండ్లు అందచేత

అద్దె బండ్లు పెట్టుకుని పండ్లు, టిపెన్ బండ్ల వ్యాపారులు అద్దె భారం లేకుండా చేయాలనే సంకల్పంతో పేదవారికి చేయూతనిస్తూ మంగళగిరి నియోజవర్గంలో( ఆగష్టు 6 2022) నాటికి పండ్ల వ్యాపారులకు 147 తొపుడు బండ్లు అందింపచేశారు. 7 టిఫిన్ బండ్లు, 7 ఇస్త్రీ బండ్లు, వికలాంగులకు 11 ట్రై సైకిళ్లు నారా లోకేష్ తన స్వంత ఖర్చుతో అందింపచేస్తున్నారు.

వేసవి దాహార్తి తీర్చిన లోకేష్

మంగళగిరి నియోజవర్గంలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో మూడు ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి వేసవి దాహార్తి తీర్చారు. మంగళగిరి నియోజవర్గ టిడిపి కార్యాలయంలో మంచినీటి వాటర్ ఫ్లాంట్ ఏర్పాటు చేసి పరిసర ప్రాంత ప్రజలకు మీనరల్ వాటర్ ను ఉచితంగా అందిస్తున్నారు.

స్వయం ఉపాధికి మహిళాలకు కుట్టు శిక్షణ

మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మహిళాలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ (టైలరింగ్) సెంటర్ ను ఏర్పాటు చేశారు. మహిళాలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వివిధ సాఫ్ట్ వేర్ కోర్సులు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మరిన్ని సేవ కార్యక్రమాలను అమలుపరిచే దిశగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here