శవ రాజకీయాలకు పెట్టింది పేరు YSRCP

0
6
onlge police station

-బీరం అరుణారెడ్డి

స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి గారి మృతి పై అధికార వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుతున్న కట్టు కథలను , అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు తెలుగు మహిళలు ఈరోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ మహిళా జనరల్ సెక్రటరీ బీరం అరుణారెడ్డి మాట్లాడుతూ శవ రాజకీయాలకు పెట్టింది పేరు వైఎస్ఆర్సిపి విషాదంలో ఉన్న కుటుంబంపై కూడా నీచమైన ప్రచారం చేయడం వైసీపీ కుసంస్కారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి మాట్లాడుతూ లోకేష్ పై విజయ్ సాయి రెడ్డి దుష్ప్రచారం ఆపకపోతే తెలుగు మహిళలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి న్యాయం చేశారో కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనిఅన్నారు.రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం మాట్లాడుతూ పేటీఎం బ్యాచ్ తో విష ప్రచారం చేయటం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మళ్లీ అధికారం కోసం ఇటు వంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని తక్షణమే ఇటువంటి విషపు రాతలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమానూరు పావని, పార్లమెంట్ కార్యదర్శులుగంగవరపు పద్మ,కేశన శేషమ్మ, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు కత్తి పద్మ, పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు మండవ లావణ్య, ఎల్ టి భవాని, ఉప్పలపాటి నాగేంద్రమ్మ,కొక్కిలి గడ్డ లక్ష్మి, మేదరమెట్ల పార్వతి, మేరీ నిరీక్షణ కుమారి, బెజవాడ సుశీల తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here