శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ నెల 10 న ప్రారంభమైన ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠ పాలిత శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారంతో ఘనంగా శాస్త్రోక్తంగా ముగిసాయి.
.కార్యక్రమాలలో భాగంగా శ్రీవారికి శుక్రవార అభిషేకం , సహస్రనామార్చన ఆలయ అర్చకస్వాములు నిర్వహించారు. పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో విష్వక్సేన ఆరాధన, కుంభారాధన, సుదర్శనారాధన, సర్వదైవత్వ హోమం, సహస్రశీతి మంత్ర హోమం, విశేష స్నపన తిరుమంజనం, ప్రాయశ్చిత్త హోమం,ఉక్త హోమం, పూర్ణాహుతి, రక్షా బంధనవిసర్జన, ఆచార్య శేష వస్త్ర బహుమానం, బ్రహ్మ ఘోష, యజమాన ఆశీర్వచనం వైఖానస ఆగమానుసారం జరిగాయి.ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
.ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, టిటిడి ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆలూరు వేంకట రమణారావు, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని పరాంకుశం సీతారామాచార్యులు బృందాన్ని సత్కరించారు. గృహస్థులకు శ్రీవారి పవిత్రా లతోపాటు భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు.