శివ భక్తులకు పోలీసుల సేవలు..

0
14

కాళ్లు నొక్కి, నొప్పుల నివారణలకు స్ప్రే కొట్టి… వీడియోలు వైరల్ అవుతున్నాయి. కన్వర్ యాత్రికుల కోసం ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వారి యాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వారి అలసటను తీర్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా శివభక్తులకు పోలీస్ అధికారులు సేవలు చేస్తున్నారు. వారి కాళ్లు నొక్కుతున్నారు. నొప్పుల నివారణకు స్ప్రేలు కొడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాదాపు కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఈ యాత్ర ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది.

ఉత్తరప్రదేశ్‌లో కన్వరియాల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవడమే కాదు.. వారికి వివిధ రకాలై సేవలు అందిస్తున్నారు. యాత్రలో అలసిపోయిన శివభక్తుల కాళ్లను నొక్కడం, వారి కాళ్లనొప్పుల నివారణకు పెయిన్ రిలీఫ్ స్ప్రేలను కొట్టడం వంటివి చేస్తున్నారు. అమ్రోహాలో ఎస్‌ఐ రాజేంద్ర పుందిర్‌.. కన్వరియాల కాళ్లకు ఆయింట్‌మెంట్ రాసి.. మసాజ్‌ చేశారు. హపూర్‌ క్యాంపులో సైతం మరో పోలీసు అధికారి కన్వరియాల కాళ్లు నొక్కారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోమ్‌వీర్ సింగ్ హాపూర్‌లోని తాత్కాలిక శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న కన్వారియా కాళ్లకు నొప్పి నివారణ స్ప్రే వేశారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here