శ్మశానవాటికలపై జీఎస్టీ లేదు

0
3
nirmala sitaraman

జీఎస్టీ పెంపుపై విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు. ఏయే వస్తువులు, పదార్థాలపై జీఎస్టీ పెరిగిందో, వేటిపై జీఎస్టీ లేదో వివరించారు. ఈ క్రమంలో శ్మశానవాటికలపైనా జీఎస్టీ లేదని వివరించారు. దేశంలో ధరల పెరుగుదల అంశంపై రాజ్యసభలో మంగళవారం (ఆగస్టు 2) జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. వ్యంగాస్త్రాలు సంధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి పోస్టు చేస్తున్నారు.

పేదలు వినియోగించే ఏ వస్తువు పైనా ట్యాక్స్ విధించలేదని తెలిపిన నిర్మలా సీతారామన్.. పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగ, తృణధాన్యాలు లాంటి ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు చెప్పారు. రాష్ట్రాలు వీటిపై ఇప్పటికే జీఎస్టీ వసూలు చేస్తున్నాయంటూ కేంద్రం నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.‘బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ లేదు. కస్టమర్ల చెక్‌బుక్‌లపై ఎలాంటి పన్ను ఉండదు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఐసీయూలకు జీఎస్టీ లేదు. రోజుకు రూ.5000, అంతకంటే ఎక్కువ అద్దె చెల్లించే గదులకు మాత్రమే జీఎస్టీ విధించాం. శ్మశానవాటికలకు జీఎస్టీ లేదు. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రం ట్యాక్స్ ఉంటుంది’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here