లక్ష్మీదేవి (సింహవల్లీ తాయార్ అమ్మవారి ఆలయము వద్ద భారీ ఏర్పాట్లుసింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం పూజాది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శ్రావణ శుక్రవారాలు ను ఐదు వారాల పాటు నిర్వహించనున్నారు.. ఇందుకోసం ఆలయ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.. సింహాద్రి నాధుడు ఇష్టసఖి ఐన లక్ష్మీ దేవి ఆలయం వద్ద ( సింహ వల్లీ తాయారు అమ్మవారు ఆలయము) బుధవారం నుంచి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు ప్రారంభించారు.. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను దేవస్థానం క్రమం తప్పకుండా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది… ఈ ఏడాది కూడా 5 వారాలపాటు శుక్రవారం రోజుల్లో సహస్రనామార్చన, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు… బుధవారం సింహాద్రి నాధుడును దర్శించుకున్న అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆయా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.. ఉత్సవాల నిర్వహణలో సింహాచలం దేవస్థానం అత్యంత ముందువరుసలో ఉందని ఇందుకు ఆలయ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు., భక్తులకు ఉత్సవాల్లో కల్పిస్తున్న సదుపాయాలు అందరు మన్ననలు పొందుతున్నట్లు శ్రీనుబాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు.. అందుకు సమష్టి కృషి కారణమన్నారు… అప్పన్న నిజరూప దర్శనం, గిరి ప్రదక్షిణ ఉత్సవాలు విజయవంతం చేసిన అందరికీ శ్రీను బాబు దన్యవాదాలు తెలిపారు.
