శ్రీలంక షట్లర్‌ పై  అలవోక గెలుపు

0
2
kidambi-srikanth

బ్యాడ్మింటన్ ఫురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక షట్లర్ దుమిందు అబీవిక్రమతో ప్రీక్వార్టర్ ఫైనల్‌లో తలపడిన కిదాంబి శ్రీకాంత్.. అలవోక విజయాన్ని అందుకున్నాడు. మ్యాచ్‌లో భారత షట్లర్‌కి కనీస పోటీని కూడా దుమిందు ఇవ్వలేకపోయాడు.మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుని కొనసాగించిన కిదాంబి శ్రీకాంత్.. తొలి సెట్‌ని 21-9తో అలవోకగా చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్‌లో దుమిందు పుంజుకునే ప్రయత్నం చేసినా శ్రీకాంత్ అతనికి అవకాశం ఇవ్వలేదు. చకచకా పాయింట్లు సాధిస్తూ 21-12తో రెండో సెట్‌ని గెలవడం ద్వారా మ్యాచ్‌ని ముగించేశాడు.గురువారం ఉగాండా షట్లర్‌ డేనియల్‌పై కూడా ఇలానే వరుస సెట్లలో కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. ఫస్ట్ సెట్‌ నుంచి డేనియల్ తేలిపోగా.. కిదాంబి 21-9, 21-9తో మ్యాచ్‌ని చేజిక్కించుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్ జోరు చూస్తుంటే.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి పతకాన్ని అందించేలా కనిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here