ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠ పాలిత శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒంగోలు గాంధీరోడ్డుకు చెందిన
మువ్వల శ్రీనివాసరావు, స్వప్న దంపతులు మేల్ చాట్ వస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. మువ్వల శ్రీనివాసరావు దంపతులను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, టిటిడి ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆలూరు వేంకట రమణారావు, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు అభినందించారు.