శ్రీవారి సేవకు లండన్‌ యువతి

0
2

తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు దేశం నలుమూలల నుంచి శ్రీవారి సేవకులు వస్తుంటారు. విదేశాల నుండి కూడా భక్తులు శ్రీవారి సేవకు రావడం మొదలైంది. లండన్‌లో స్థిరపడిన భక్తురాలు నీతు, కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు. శ్రీవారి సేవలలో తరించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు నీతు చెప్పారు. తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని నీతు కుటుంబీకులు అన్నారు.

మొత్తం 11 మంది సభ్యులు ఆన్ లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించారు. నీతు లండన్‌లో ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులపాటు అన్నప్రసాద కేంద్రంలో కూరగాయలు తరగడం, అన్నప్రసాదాలు వడ్డించడం, కళ్యాణకట్టలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భక్తులకు బ్లేడ్లు అందించడం, అగరబత్తీల విక్రయం తదితర సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈ కేంద్రం పరిశీలనకు విచ్చేసిన టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి నీతుతోపాటు ఆమె కుటుంబసభ్యులతో ముచ్చటించారు. శ్రీవారి సేవ చేసేందుకు లండన్ నుంచి వచ్చినందుకు అభినందించారు. యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలువడం హర్షణీయమని చెప్పారు. యువతీ యువకులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జేఈఓ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here