- శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఇంటూరి నాగేశ్వరరావు గారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం మక్కినవారిపాలెంలో గ్రామస్తుల పిలుపు మేరకు శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు హాజరైనారు. శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, వి ఆర్ కోట గ్రామ పార్టీ అధ్యక్షుడు బోయినపల్లి సీతయ్య, తెలుగు యువత పల్లపోతు వెంగళరావు, సుబ్బారావు మరియు గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు…
