శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం…

0
10

పటిష్ట భద్రతతో గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్.

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి జిల్లా ఎస్పీ అభినదించిన గుంటూరు రేంజ్ డీ.ఐ.జీ శ్రీ డాక్టర్ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిబద్ధతతో బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ది:11.08.2022 న ఖరారు అయినప్పటి నుండి బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్. ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతంగా నిర్వహించడానికి ఇతర శాఖల అధికారులను సమన్మయం చేసుకుంటూ, జిల్లా పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా నిర్వహిస్తూ, జిల్లా ఎస్పీ స్వయంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని, కాన్వాయ్ వెళ్ళు మార్గాన్ని, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లోని సభావేదికను, సభ ప్రాంగణంలోకి VIP/VVIP లు, మరియు సామాన్య ప్రజలు వెళ్ళు మార్గాలను, కంట్రోల్ రూమ్ ను, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఆ ప్రదేశాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 1560 మంది పోలీస్ ఆధికారులను మరియు సిబ్బందితో ప్రశాంతమైన వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతంగా జరిగేవిధంగా చర్యలు తీసుకున్నారు.

ఈ రోజు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నిమిత్తం భద్రత ఏర్పాట్లను పరిశీలించడానికి బాపట్లకు విచ్చేసిన గుంటూరు రేంజ్ డీ.ఐ.జీ శ్రీ డాక్టర్ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్. భద్రత ఏర్పాట్లను పరిశీలించి, పోలిస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రదేశమును, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ ప్రదేశాన్ని, కాన్వాయ్ వెళ్లే రూట్ లో బందోబస్తును పర్యవేక్షించి, బందోబస్తు ఏర్పాట్లు పటిష్టగా ఉన్నాయని జిల్లా ఎస్పీ గారిని అబినందించినారు.

విద్య దీవెన పధకం ప్రారంభ కార్యక్రమానికి బాపట్ల కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు హెలిప్యాడ్ వద్ద గుంటూరు రేంజ్ డీ.ఐ.జీ శ్రీ డాక్టర్ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్. మరియు బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్., పుష్పగుచ్చాం అందజేశారు.

జిల్లా ఎస్పీ ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన పటిష్ట భద్రతతో గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతంగా ముగిసిన అనంతరం పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీ-బ్రీఫింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిని అమలుపరుస్తూ విధులు నిర్వర్తించడం వల్ల ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతంగా పూర్తి చేయగలిగామని, హెలిప్యాడ్ వద్ద, కాన్వాయ్ వెళ్ళు మార్గంలో, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద, సభ ప్రాంగణంలోకి వెళ్ళు మార్గాల వద్ద, గేలరీలలో, కంట్రోల్ రూమ్ లో, వాహనాల పార్కింగ్ ప్రదేశాలలో, ట్రాఫిక్ లో మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిబద్ధతతో బందోబస్తు విధులు నిర్వహించడం వల్ల ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా నిర్వహించగలిగామని, ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ ఆధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అభినదించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here